పాయల్ మరోసారి ఓపెన్ చేసింది.. !


తొలి సినిమా ‘ఆర్ఎక్స్100’తోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది పాయల్ రాజ్ పుత్. ‘ఆర్డీఎక్స్ లవ్’లోనూ అందాల ఆరబోతని కంటిన్యూ చేసింది. ఇక వెంకీమామ, డిస్కోరాజా సినిమాల్లో కాస్త పద్దతిగానే కనిపించింది.

ఐతే, ప్రస్తుతం పాయల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ సరసన “ఏంజెల్” అనే చిత్రంలో నటిస్తోంది.

ఇదో హారర్ సినిమా. కే.ఎస్.అదియమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇదిలావుంటే..  పాయల్ రాజ్ పుత్ తన ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తోంది.

టాప్ టు బాటమ్ సిల్వర్ మెరుపులతో పాయల్ తళుకుబెళుకులు కిర్రాక్ పుట్టించాయి. మెడలో హారం  ప్రత్యేక మైన  డిజైన్ తో ఆకర్షిస్తోంది. ఆమె నడుమ ఒంపుసొంపులు కుర్రకారును కవ్విస్తున్నాయి. చూస్తుంటే.. మరోసారి గ్లామర్ పాత్రలో మెరిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుంది.