ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు.. ఒకరు మృతి !
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి తుపాకి గుండ్ల శబ్ధం వినిపించిండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. మోహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి నరేశ్ యాదవ్ గెలుపొందారు. విజయం అనంతరం నరేష్, ఆయన మద్దతుదారులు, ఆప్ కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు.
విజయయాత్ర అనంతరం నరేశ్ దేవాలయానికి వెళ్లి తన కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఆప్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీలో పోలీస్ శాఖ కేంద్రం పరిథిలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేకు భద్రత కల్పించకపోతే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ గన్ కల్చర్ ఇటీవల పేట్రేగిపోవడం కలకలం సృష్టిస్తోంది. సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో నేపథ్యంలోనూ ఢిల్లీలో తుపాకుల శబ్ధం వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు పోలీసులకి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యేపై దుండగులు తుపాకులతో కాల్పులు జరగపడం కలకలం సృష్టిస్తోంది. మరీ.. ఈ ఘటనపై కేంద్ర ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటుంది అనేది చూడాలి.