నేటి ఏపీ కేబినేట్’లో చర్చించనున్న అంశాలివే.. !
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఏపీ కేబినేట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనునన్ నేపథ్యంలో తాజా కేబినేట్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్ ఇవ్వాలనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా మంత్రి వర్గం ముందు రానున్నాయి.
ఎర్రచందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు వ్యవహారంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలు, నమోదైన కేసుల రద్దు ప్రతిపాదనపైనా కేబినేట్ లో చర్చకు రానుంది. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుపైనా చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనతో పాటు.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటపైనా మంత్రివర్గం చర్చించనుంది.
మూడు రాజధానుల బిల్లు ఏర్పాటు వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలపై కేబినేట్ లో చర్చకు రానుంది. ఇక కేబినేట్ మీటింగ్ పూర్తికాగానే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. మండలి రద్దు, ఏపీకి మూడు రాజధానుల అంశంపై చర్చించనున్నారు.