సుగాలీ కేసు సీబీఐకి అప్పగించాలి : పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కర్నూలులో పర్యటిస్తున్నారు. కర్నూలులోని కోట్ల కూడలిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడార్. విద్యార్థిని సుగాలీ అత్యాచారం, హత్య కేసులో సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఈ సంఘటన జరిగితే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. విద్యార్థినికి న్యాయం జరగకపోతే కర్నూల్ లో జుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం లాభమని పవన్ అన్నారు.
దిశ సంఘటనకు ముందే సుగాలీ ప్రీతి అత్యాచారం, హత్య జరిగాయని, అయినా ప్రభుత్వ పెద్దలు ఇంత వరకూ న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం వల్లే ఈ ర్యాలీని నిర్వహించామని చెప్పారు. విద్యార్థిని హత్య కేసు విచారణను ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ అన్నారు.