గుడ్ న్యూస్ : హార్దిక్‌ పాండ్య వచ్చేస్తున్నాడు

కివీస్ వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ కి గురైన టీమిండియాకు గుడ్ న్యూస్. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య త్వరలోనే జట్టులో చేరనున్నారు.  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆడే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల లండన్‌లో సాధారణ చెకప్‌ చేయించుకున్న పాండ్య ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

‘లండన్‌ నుంచి పాండ్య తిరిగొచ్చాడు. ఇది రెగ్యులర్‌ చెకప్‌ మాత్రమే. ఈ వారం నుంచి అతడు బౌలింగ్‌ సాధన చేస్తున్నాడు. త్వరలోనే టీమ్‌ఇండియాకు ఎంపికవ్వచ్చు. వీలైతే దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడిని చూడొచ్చు’ అని ఎన్‌సీఏ సభ్యుడొకరు చెప్పారు.