బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్.. మోక్షజ్ఝ రెడీ అవుతున్నాడు !

బాలయ్య నటవారసుడుగా ఆయన తనయుడు మోక్షజ్ఝ ఎంట్రీ ఇస్తారని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూడా తనయుడు ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ లో కనిపించిన మోక్షజ్ఝ
బొద్దుగా కనిపించాడు. దాంతో.. నటన పట్ల మోక్షజ్ఝని ఆసక్తి లేనట్టుందని అభిమానులు నిరాశపడ్డారు. 

కానీ, నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి మోక్షజ్ఞని  న్యూయార్క్ పంపించనున్నట్టు  సమాచారమ్. ‘న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్’లో శిక్షణ నిమిత్తం ఆయనను పంపిస్తున్నారట. స్టార్ హీరోల కిడ్స్ చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని సమాచారం. రాగానే మోక్షజ్ఝ కోసం కథని రెడీ చేసి.. రంగంలోకి దింపుతారని చెబుతున్నారు.