ప్రియుడితో మస్త్’గా ఎంజాయ్ చేస్తున్న పాయల్


టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఆయనతో కలిసి దిగిన ఫోటోలని పాయల్ ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐతే, అతడు ఎవరు ? ప్రియుడా ? స్నేహితుడా ?? బంధువా ??? తెలియకపోవడంతో ఎవరు పాయల్ ప్రేమకథపై ఫోకస్ చేయలేదు. తాజాగా అతడు నా ప్రియుడే. నా ప్రాణం అంటూ క్లారిటీ ఇచ్చింది పాయల్.

అతని పేరు సౌరభ్ డింగ్రా. అతను ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతనితో పాయల్ డేటింగ్ చేస్తోంది. ప్రియుడుపుట్టినరోజు సందర్భంగా అతనితో సరదాగా గడిపిన ఫొటోలను పాయల్ షేర్ చేసింది. ‘నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే’ అని పాయల్ ట్వీట్ చేసింది. దీంతో.. పాయల్ ప్రేమలో ఉందనే విషయంలో స్పష్టత వచ్చినట్టయింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపిస్తూనే అద్భుతమైన నటనని కనబర్చింది. ఈ సినిమాతో పాయల్ స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ, కథ ఎంపికలో తడబడిన పాయల్ విజయాలు దక్కలేదు. గత యేడాది వెంకీమామ, డిస్కోరాజా సినిమాలతో సందడి చేసింది. ప్రస్తుతం పాయల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ్ లో మాత్రం ఓ సినిమా చేస్తోంది.