క్రాక్ టీజర్ అప్ డేట్

బలుపు కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన ‘బలుపు’ సినిమా హిట్ అయింది. ఇప్పుడు వీరి కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే క్రాక్ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టనున్నారు. టీజర్ ని వదలనున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా క్రాక్ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది. ఇందులో రాత్రివేళలో రవితేజని దుండగులు వెంటాడుతున్నారు. త్వరలోనే క్రాక్ టీజర్ రాబోతుందని పోస్టర్ లో తెలిపారు. ఇక రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకి మరో హిట్ పడలేదు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన డిస్కోరాజాపై భారీ అంచనాలుపెట్టుకొన్నా.. ఆ అంచనాలని నిజం కాలేదు. 

వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన డిస్కోరాజా మంచి సినినిమా అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఆడలేదు. దీంతో రవితేజ ఆశలన్నీ క్రాక్ పై నే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.