క్యాట్ ని ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు 

సీనియర్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని.. గత ఏడాది మే 31 నుంచి తనకు జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని పిటిషన్ లో ఆరోపించారు.

రాజకీయ కక్షతోనే తనపై సస్పెన్షన్‌ వేటు వేశార.. తన సస్పెన్షన్‌పై స్టే ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వర్లు క్యాట్‌ను కోరారు. ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ పిటిషన్ లో తెలిపారు. మరీ ఏబీ వెంకటేశ్వరావు పిటిషన్ పై క్యాబ్ ఎలాంటి తీర్పినిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.