కేంద్రంపై కేటీఆర్ సుతిమెత్తని మాటలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, జీఎస్టీ చెల్లింపులు, చట్ట ప్రకారం ఇచ్చిన హామీలపై చర్చించామని తెలిపారు. కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో రాష్ట్రానికి ఉండే సంబంధాలను నెరుపుతూనే అంశాల వారీగా విభేదించామన్నారు. సీఏఏ అంశంలోనూ రాష్ట్రం తరపున విభేధిస్తున్నట్లు ప్రకటించామన్నారు.
ఒక పార్టీగా, రాష్ట్రంగా ఎందుకు విభేదిస్తున్నామో కేంద్రానికి విడమరిచి చెప్పామని కేటీఆర్ అన్నారు. కేంద్రంతో తత్సబంధాలని కోరుకుంటున్నాం. కానీ అంశాల వారీగా కొట్టిని వ్యతిరేకించక తప్పదని కేటీఆర్ వివరించారు. అంతేకాదు.. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా.. మంత్రి కేటీఆర్ కేంద్రంపై సుత్తిమెత్తని మాటలు మాట్లాడారు. సపోర్ట్ చేశారు. విమర్శించారు. ఫైనల్ గా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిపై డిమాండ్ చేశారు కూడా. రాజ్యనీతి అంటే ఇదేనేమో.. !