రాశీకి అదొక్కటే సరిపోదట
కేవలం బాక్సాఫీస్ విజయాలు మాత్రమే ముఖ్యం కాదంటోంది యంఘ్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదట్లో గ్లామర్ పాత్రల్లో మాత్రమే మెరిసిన రాశీ.. తొలిప్రేమ సినిమాతో తనలోని అసలు సిసలు నటిని బయటికి తీసింది. ప్రస్తుతం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ చేస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ టీజర్ ని చూస్తే.. రాశీ బోల్డ్ పాత్రలో మెరవనుందనే తెలుస్తోంది.
ఐతే, టీజర్ చూసి అలా అనుకుంటున్నారు. కానీ కథలో అవేవి ఉండవు. ఆ పాత్రతో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని చెప్పింది. నాయికగా మరో స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు బాక్సాఫీస్ విజయం ఒక్కటే నాకు చాలదు. నేను నటించే సినిమాకు నా పాత్ర ద్వారా ఒక విలువ తీసుకురావాలి అన్నారు
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండకి జంటగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే నటించారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా రేపే (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు రానుంది.