‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ ట్విట్టర్ రివ్యూ – భారీ సిక్సర్.. బంతి స్టేడియం బయటే.. 


సింగిల్స్, డబుల్స్ తీసే ఓపిక నాకు లేదు. కొడితే సిక్సే. ప్రతిసారి సిక్స్ కొట్టాలనే బరిలోకి దిగుతా. ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’గా భారీ సిక్సర్ కొట్టాలనే బరిలోకి దిగానని ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ అన్నారు. అన్నట్టుగా.. భారీ సిక్స్ కొట్టేశారు. బంతి ఏకంగా స్టేడియం బయటపడింది. అవునూ.. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా వరల్డ్ ఫేమస్ లవ్వర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్.

సినిమా చూసిన ప్రేక్షకులు భారీ సిక్సర్ అని చెబుతున్నారు. మరోసారి విజయ్ ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు. అద్భుతమైన నటనతో అదరగొట్టేశాడు. క్రాంతి మాధవన్ రాసిన కథ బాగుంది. దాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఏపీసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. కథ-కథనం అద్భుతంగా నిలిచాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ బాగా పండాయి. కొత్తగూడెం ఏపీసోడ్ బాగుంది. రాశీఖన్నా చాలా బాగా నటించింది. ఐశ్వర్య రాజేష్ నటన షాక్ ఇస్తుంది. మొత్తానికి.. వరల్డ్ ఫేమస్ లవ్వర్ గా విజయ్ దేవరకొండ భారీ సిక్సర్ కొట్టేశారు. ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టేనని చెబుతున్నారు.

మరోవైపు, నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫస్టాఫ్ ఓకే. కానీ సెకంఢాఫ్ బోరింగ్ అని ఒకరిద్దరు అంటున్నారు. విజయ్ నటన మాత్రమే హైలైట్. కథ-కథనాలు ఆకట్టుకోలేదని చెబుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చాయ్. కానీ, వాటిని అన్నింటిని దాటుకొని.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ట్రెండ్ ని సెట్ చేసింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవ్వర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్ చెబుతున్నారు.