200 మిలియన్ వ్యూస్ రాములా.. !

‘రాములో రాములో.. ‘ హవా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. థమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 200కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని క్రాస్ చేసింది.

ఇక అల.. పాటల హవా ఇంకా కొనసాగుతోంది. తాజాగా ‘రాములో రాముల’ సాంగ్ 200మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 1.2మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుంది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, మంగిలి కలిసి పాడారు. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించారు. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటించారు. మురళీ శర్మ, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.