యువీ.. ఓ ఫీనిక్స్ పక్షి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జరిగిన విండీస్ సిరీస్లో టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ గాయపడిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సరిగ్గాలేదని యువీని శ్రీలంక సిరీస్కు ఎంపిక చేయలేదు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్కు కూడా యూవీని ఎంపిక చేయలేదు. దీంతో యువీ కెరీర్ పై మరోసారి తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
యువీ ఫీనిక్స్ పక్షిలాంటి వాడు. చితాభస్మం నుంచి ఫీనిక్స్ మళ్లీ పుట్టినట్టే యువీ ఎదుగుతూ విమర్శకులకు తన సత్తా చూపిస్తాడు అంటున్నాడు మాజీ సెలెక్టర్ కరీమ్. యువీ పునరాగమనాలతో విమర్శలను, సెలెక్టర్లను ఎప్పుడూ విస్మయ పరుస్తాడని పేర్కొన్నారు. అతను ఛాంపియన్. మళ్లీ జట్టులోకి తిరిగొస్తాడని కరీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరీ.. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.