ఏందీ.. ముద్దు పెడితే ఏడుస్తారాబ్బా.. !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా లవ్ స్టోరీ నుంచి తొలిపాట ‘ఏయ్ పిల్లా.. ‘ మ్యూజికల్ ప్రివ్యూ వీడియోని విడుదల చేశారు. ఇందులో లవ్ ఫీల్ ని చూపించారు.
బస్సులో వెళ్తుండగా సాయి పల్లవి పక్కనే ఉన్న నాగచైతన్యకి గట్టిగా ముద్దుపెట్టేసింది. దాంతో చైతూ కంట్లోనుంచి నీళ్లొచ్చాయ్. ఏందీ.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా అంటూ సాయిపల్లవి అనడం ఆకట్టుకుంది. ఈ పాటకి చైతన్య పింగళీ లిరిక్స్ అందించారు. హరిచరణ్ పాడారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఏయ్ పిల్లా పాటని మీరు వినేయండీ.. !