మరో హాసినిలా వుందే.. !
‘బొమ్మరిల్లు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు భాస్కర్. ఈ సినిమాతో బొమ్మరిల్లుని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. సిద్ధార్థ్-జెనిలియా జంటగా నటించిన ‘బొమ్మరిల్లు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ట్రెండ్ సెట్ చేసింది. ఇటు యూత్, అటు ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సినిమాలో హాసినిగా జెనిలియా నటన అదిరిపోయింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అది.
ఇక బొమ్మరిలు తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఆ రేంజ్ హిట్ దక్కలేడు. అసలు ఆయన నుంచి పెద్దగా సినిమాలే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. అఖిల్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అందుకే ఏరికోరి పూజా హెగ్డే ని తీసుకున్నారు.
ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ నుంచి పూజా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో షూస్ ని రెండు చేతుల్లో పట్టుకొని జాలీగా కనిపిస్తోంది పూజా. అచ్చం హాసినిలా ఉంది. దీంతో.. బొమ్మరిల్లు భాస్కర్ ని మరో హాసిని తీసుకున్నాడని చెప్పుకొంటున్నారు.