‘వి’ టీజర్ టాక్ – నాని ఓ సైకో 


ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీరావు హైదరీ కథానాయికలు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

ఈ చిత్రంలో నాని రాక్షసుడు, సుధీర్ బాబు రక్షకుడుగా కనిపిస్తారని చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ ని వదలింది. టీజర్ కూడా ఆ లైన్ ని ఫాలో అవుతూ కట్ చేశారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అతనికి సవాల్ విసిరే విలన్ పాత్రలో నాని కనిపించాడు. నాని విలనీజం టీజర్ లో మాములుగా లేదు. ఆయన్ని ఏకంగా ఓ సైకోగా చూపించారు.

నాని, సుధీర్ బాబు సవాల్ విసురుకోవడం టీజర్ లో హైలైట్ నిలిచింది. “న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేం నీ ఫ్యాన్ ను కాదురా”, “సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు” అంటూ నాని.. సుధీర్ బాబుకు సవాల్ విసరడం హైలైట్ గా నిలిచింది. సినిమాలో యాక్షన్ హైలైట్ గా ఉండబోతుందని టీజర్ తో అర్థమవుతోంది. దానికి ఇంద్రగంటి మార్క్ ట్విస్టులు వర్కవుట్ అయితే.. ‘వి’ హిట్టయినట్టే.. !