అదా మరోసారి రెచ్చిపోయింది !


‘హార్ట్ ఎటాక్’ తెప్పించే అందాలు అదా శర్మ సొంతం. ఆ అందాలతో ప్రేక్షకులని కనువిందు చేస్తోంది.. ఈ పొడుగుకాళ్ల సుందరి. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం.. వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేయడం అదాకి అలవాటే. తాజాగా ఎఫ్ హెచ్ ఎమ్ పత్రిక కోసం అదా చేసిన ఫొటో షూట్ కాక పుట్టిస్తోంది. క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది. గతంలో చేసిన గ్లామర్ షోని మించిలా ఇది ఉంది.

పూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అదా శర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూరి, క్షణం తదితర చిత్రాల్లో మెరిసింది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ.. ఖాళీ సమయాల్లో ఫోటో షూట్స్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమాలనులని ఖుషి చేస్తోంది. అంతేకాదు.. వెబ్ సిరీస్ లోనూ మెరుస్తోంది.