అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ తల్లి సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకి సన్నిహితులు, స్నేహితులు, మెగా ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.
 
ఈ నేపథ్యంలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే అత్తమ్మా… లవ్యూ” అంటూ ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో  రామ్ చరణ్, ఉపాసన మధ్యలో సురేఖ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి నటిస్తున్న చిత్రమిది. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.