హైదరాబాద్ లో పవన్ పడవ ప్రయాణం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో పడవ ప్రయాణం చేయబోతున్నారు. హైదరాబాద్ లో పడవ ప్రయాణం ఏంటీ ? అనుకుంటున్నారా ? ‘పింక్’ రిమేక్ తో పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సమంతరంగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా  కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో మొదలు కాబోతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పడవ సెట్స్ లో  చిత్రీకరణ చేయబోతున్నారు. 

అందుకే హైదరాబాద్ లో పవన్ పడవ ప్రయాణం చేయబోతున్నారని అభిమానులు చెప్పుకొంటున్నారు. పింక్ రిమేక్, క్రిష్ సినిమాలు పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. గబ్బర్ సింగ్ ని మించేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు హరీష్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.