రస్మికకు అభిమాని ముద్దు.. అసలు నిజం ఇదీ !


హీరోయిన్ రష్మిక మందనకి ఇటీవల చేధు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ర‌ష్మిక‌తో సెల్ఫీ కోస‌మ‌ని వచ్చి ముద్దు పెట్టి పారిపోయాడంటూ.. ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ముద్దు పెట్టింది రస్మికకి కాదట. కన్నడ హీరోయిన్ నటికి అట. అదికూడా.. షూటింగ్ లో భాగమట. షూటింగ్‌లో భాగంగా జూనియ‌ర్ ఆర్టిస్ట్ ముద్దు ఇచ్చాడ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు.
 
పవన్ వడియార్ దర్శకత్వంలో ఇషాన్, ఆశిక రంగనాథ్ హీరోహీరోయిన్లుగా  ‘రేమో’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అవార్డుల ఫంక్షన్‌లో రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లే హీరోయిన్‌ను అభిమాని ముద్దుపెట్టి పారిపోయే సీన్‌ను చిత్రీకరించారు. ఈ వీడియోని త‌ప్పుగా చూపిస్తూ ర‌ష్మిక‌కి ముద్దు పెట్టి వెళ్లిపోయార‌ని త‌ప్పుగా ప్ర‌చారం చేసార‌ని ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు.  మరీ.. ఇప్పటికైనా నెటిజన్స్ రస్మికకు అభిమాని ముద్దు ముచ్చటని వదిలేస్తారేమో చూడాలి.