శ్రీరెడ్డిని ఏం పీకలేరా.. ?
వివాదాస్పద నటి శ్రీరెడ్డికి అడ్డు, అదుపూ ఉండదు. స్వేచ్చగా ఆరోపణలు చేస్తుంటుంది. ఆ ఆరోపణలకి రుజువులు మాత్రం ఉండవు. అయితే, శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన వారు మూసుకొని ఉండాల్సిందే. ఆమెపై పోలీసులకి ఫిర్యాదు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. దాంతో.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు నిజం అనుకోవాలేమో.. ! ఒకరిద్దరు ధైర్ఘ్యం చేసి.. శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసినా.. ఆమె జంకదు. డ్యాన్స్ మాస్టర్ రాకేష్ రెడ్డి ఇటీవల శ్రీరెడ్దిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తన పరువు పోయే ఆరోపణలు చేస్తుందని ఆయన శ్రీరెడ్డిపై పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. అయితే దానికి శ్రీరెడ్డికి ఏమాత్రం భయపడలేదు. హైదరాబాద్ లోనే ఉన్నాను. ఏం పీకుతావ్ రా ? అంటూ రాకేష్ మాష్టర్‌కు సవాల్ విసిరింది శ్రీరెడ్డి. కరాటే కళ్యాణి పై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె వ్యక్తిగత విషయాలపైనా కామెంట్ చేసింది. శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ఆమెతో గెలుక్కోవడం ఇష్టపడని వారే ఎక్కువ.
ఈ నేపథ్యంలో.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం అయినా ఉండాలి. లేక శ్రీరెడ్డి అంటే భయం అయినా ఉండాలి. మొత్తానికి.. శ్రీరెడ్డిని ఏం పీకలేరని మాత్రం అర్థం అవుతోంది. అందుకే ఆమె అంతలా రెచ్చిపోతుంది. శ్రీరెడ్డి బారినపడిన వారిలో స్టార్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు. సినీ పెద్దలుగా చలామణి అయ్యేవాళ్లు ఉన్నారు. వాళ్లు శ్రీరెడ్డిని లైట్ తీసుకొని ముందుకు సాగుతున్నారు. మిగితావారు కూడా వారినే అనుకరిస్తున్నట్టు కనబడుతోంది.