తొలి టెస్ట్ : రెండో ఇన్నింగ్స్’లో భారత్ 144/4

టీమిండియా బలం టాప్ ఆర్డర్ నే. ఆ విషయం కివీస్ వన్డే సిరీస్ లో తేలింది. గాయం కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకి దూరమయ్యాడు. కొత్త ఓపెనర్లు పృధ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. కెప్టెన్ కోహ్లీ ఉన్నట్టుండి.. ఫామ్ కోల్పోయాడు. ఆ ఎఫెక్ట్ తో వన్డే సిరీస్ లో టీమిండియాకు క్లీన్ స్వీప్ తప్పలేదు.

టెస్టు సిరీస్ లోనూ టీమిండియా తడబడుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాని 165 పరుగులకే పరితమం చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా తడబడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 65 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టు కంటే 39 పరుగులు వెనుకబడి ఉంది.

రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ 58, కోహ్లీ 19, ఫృథ్వీషా 14, ఛటేశ్వర్ పుజారా 11 పరుగులు చేసి ఔట్ కాగా, అజింక్య రహానే 25, హనుమ విహారి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెన్ట్ బౌల్డ్ మూడు, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు. నాలుగో రోజు రహానే, విహారిలతో పాటు రిషభ్‌ పంత్‌లు బ్యాటింగ్‌పైనే టీమిండియా తొలి టెస్టు భవిత్యం ఆధారపడి ఉంది.