చిరు నక్సలైట్.. ఇదిగో రుజువు !

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం చిరంజీవిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్‌ ఒకటి నెట్టింట్లో లీక్‌ అయ్యింది. ఇందులో చిరు మెడలో ఎర్ర కండువా ధరించి కనిపించారు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మొదటి నుంచి ఈ సినిమాలో నక్సలైట్ ఏపీసోడ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. సినిమాలో చిరు మాజీ నక్సలైట్ గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా లీకైన లుక్ ని చూస్తే అది నిజమేనని అర్థమవుతోంది. చిరు మెడలో ఎర్రని కండువా. ఆయన డ్రెస్సింగ్ లుక్ అంతా నక్సైట్ ని పోలివుంది. మరోవైపు, ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఆయనది నక్సలైట్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఈ చిత్రంలో చిరుకి జంటగా త్రిష నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.