తిరుమలకు మోనో రైలు

తిరుమలకు వెళ్లాలంటే రోడ్డుమార్గం, లేదంటే కాలీ నడకన వెళ్లాల్సిందే. అనీ కుదిరితే తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైల్స్ రావొచ్చు. ఈ మేరకు ప్రతిపాదనలు రెడీ చేయమని హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఆదివారం అమరావితిలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్‌ రైల్‌ తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని.. తీగలపై నడిచే రైలు వంటివాటి జోలికి వెళ్లడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని సుబ్చారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళ్తోందని.. దాన్ని మోడల్‌గా తీసుకుని తిరుమలకు రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.