‘భీష్మ’ ఖాతాలో హాఫ్ మిలియన్

యంగ్ హీరో నితిన్ మరోసారి మెరిశాడు. వెంకీ కడుముల దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భీష్మ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండ్రోజుల్లోనే రూ. 10కోట్ల షేర్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో భీష్మ హవా చూపిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ రాబట్టాడు. తొలివారంలోనే మిలియన్ మార్క్ క్రాస్ చేయనున్నాడు.

ఇక ‘భీష్మ’ కథలో కొత్తదనం లేకపోయినా.. ఎంటర్ టైనింగ్ గా ఉంది. కథని వినోదాత్మకంగా చెప్పడంలో దర్శకుడు వెంకీ కడుముల సక్సెస్ అయ్యారు. నితిన్ కామెడీ టైమింగ్ అదిరింది. యాక్షన్ లోనూ  ఇరగదీశాడు. వెంకీ కడుముల రాత, తీతలోనూ ఆయన గురువు త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. ఫలితంగా భీష్మ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తొలివారంలోనే భీష్మ లాభాలు తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.