‘కిక్’ సెంటిమెంట్’తో ‘క్రాక్’.. బ్లాక్ బస్టర్ హిట్టే !

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి ‘కిక్’ సినిమాకి పోలికలున్నాయని రవితేజ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు.

 ‘kick’,  ‘krack’ సినిమాలు రెండు kతో మొదలయ్యాయి. kతో ఎండ్ అయ్యాయ్. అంతేకాదు.. కిక్ సినిమా రిలీజైన మే8నే క్రాక్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కిక్ సెంటిమెంట్ క్రాక్ సినిమా విషయంలో రిపీట్ కానుంది. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని రవితేజ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు. కిక్ సినిమాకి సంగీతం అందించిన థమన్ నే క్రాక్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. పైగా ప్రస్తుతం థమన్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.