పవన్ సడెన్ సప్రైజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రిమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈరోజు (ఆదివారం) హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో  ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. లాయర్ గెటప్ లో పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాంతో పాటు ఒకట్రెండు ఫైట్ సీన్స్  కూడా చిత్రీకరించబోటున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు, ఈ సాయంత్రం పింక్ రిమేక్ నుంచి అప్ డేట్ రానుంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు పింక్ నుంచి పాట రాబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇది అనధికారిక న్యూస్ అంటూ పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ సడెన్ సప్రైజ్ ఏంటీ ? అన్నది మరికొద్ది నిమిషాల్లో తెలిసిపోనుంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే నెలలో తెలుగు పింక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.