#Nani27 ఆలస్యమెందుకు ?


నేచురల్ స్టార్ నాని నుంచి బర్త్ డే గిఫ్ట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నాని తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాని 27వ సినిమా టైటిల్ ని ప్రకటిస్తామని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి అంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ మేరకు పోస్టర్స్ విడుదల చేశారు. కానీ, ఇప్పటివరకు నాని 27వ సినిమా టైటిల్ పై ప్రకటన రాలేదు. ఆలస్యానికి కారణాలు చెప్పడం లేదు. దీంతో నాని అభిమానులు నిరాశలో ఉన్నారు. బర్త్ డే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అఫిషియల్ గా ప్రకటించకపోయినా.. నాని 27వ సినిమా టైటిల్ ఇప్పటికే లీకైంది. ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి `శ్యామ్ సింగ రాయ్‌` అనే ఆసక్తికరమైన టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన వస్తే ఎలాంటి కన్ఫూజన్ ఉండదనేది అభిమానులు భావిస్తున్నారు.  ప్రసుత్తం నాని సుధీర్‌బాబుతో కలిసి క్రైమ్ థ్రిల్లర్ `వి`చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దాంతోపాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్‌’ని మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.