#Nani27 లీకైన టైటిల్ నే ఫిక్సయింది !

#Nani27 టైటిల్ వచ్చేసింది. టాక్సీవాల దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం#Nani27 తెరకెక్కనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే డిఫరెంట్ టైటిల్ ని పెట్టారు. సినిమా రిలీజ్ డేటుని కూడా ప్రకటించేశారు. ఈ యేడాది డిసెంబర్ 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? మిగితా నటీనటుల వివరాలని త్వరలోనే ప్రకటించనున్నారు

ప్రసుత్తం నాని సుధీర్‌బాబుతో కలిసి క్రైమ్ థ్రిల్లర్ `వి`చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దాంతోపాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్‌’ని మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఇక ఈ యేడాది నాని నుంచి మూడు సినిమాలు క్యూ కట్టనున్నాయి. వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో ప్రేక్షకులని అలరించనున్నారు నాని.