రజనీ168 టైటిల్ ఇదే !

సూపర్ స్టార్ రజినీకాంత్ 168 చిత్రం శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. #Annaatthe టైటిల్ పెట్టారు. స్టయిలీష్ గా డిజైన్ చేసిన టైటిల్ ప్రోమో వదిలారు. దర్భార్ తర్వత రజనీ నటిస్తున్న చిత్రమిది. కొన్నాళ్లుగా రజనీ నటించిన సినిమాలన్నీ యావరేజ్ గా, ప్లాపులుగా తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సినిమాపై రజనీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.