@మంత్రి హ‌రీష్‌: ఆ నీటితోనే మ‌ల్ల‌న్న పాదాల‌కు అభిషేకం.. !

క‌న్నుల పండువ‌గా జ‌రిగే కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి క‌ళ్యాణోత్స‌వానికి జిల్లా మంత్రి హ‌రీష్ రావు హాజ‌ర‌య్యారు. స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. స్వామి దయతో వచ్చే ఏడాది గోదావరి జలాలు ఇచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

మల్లన్న క్షేత్రాన్ని పర్యాటకంంగా అభివృద్ధి చేస్తామ‌ని, అలయముఖ ద్వారం నుండి ప్రధాన ఆలయం వరకు వెండి తొడుగును ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి హ‌రీష్ హామీ ఇచ్చారు. త్వ‌ర‌లోనే శాశ్వత కళ్యాణ మండంపాన్ని నిర్మిస్తామ‌ని చెప్పారు. ఆల‌యానికి వచ్చే భక్తులకు పర్యాటక ఆకర్షణకు ఉండే విధంగా మలన్న చెరువు సుందరీ కరణ చేసి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో అద్భుత క్షేత్రాంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందుతుంద‌న్నారు మంత్రి.