హైద‌రాబాద్ లో మిలియ‌న్ మార్చ్ టెన్ష‌న్…!!!

ఎస్సీవర్గీక‌ర‌ణ కోసం చేప‌ట్టిన ఆందోళ‌న‌లో మ‌ర‌ణించిన భార‌తి సంస్మ‌ర‌ణ స‌భ ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. సికింద్రాబాద్ లో జ‌రిగిన సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగ ఉద్వేగ‌భరితంగా ప్ర‌సంగించారు. కేసీఆర్ నిజంగా వర్గీకరణకు కట్టుబడి ఉంటే…భారతి మృతి చెందేది కాదని, కేసీఆర్ జాప్యం వల్లే ఎమ్మార్సీస్ ఆందోళనలు చేయాల్సి వచ్చిందని మంద‌కృష్ణ అన్నారు.

భారతి మరణానికి రెండు గంటల ముందు అసెంబ్లీ లో ఎస్సి వర్గీకరణ ఫై వాయిదా తీర్మానం ప్రతిపక్షాలు ఇచ్చాయని, వాయిదా తీర్మానాన్ని తీసుకుని చర్చించి ఉంటే…భారతి మాదిగ మరణించి ఉండేది కాదని ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌భాప్రాంగ‌ణంలో మాట్లాడుతూనే ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పై మిలియ‌న్ మార్చ్ కు క‌ద‌లాలంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ యుద్ధం పోలీసుల‌పై కాద‌ని, ప్ర‌భుత్వంపైనే అంటూ పిలుపునిచ్చారు.

దీంతో ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు ట్యాంక్ బండ్ వైపు ర్యాలీగా బ‌య‌లు దేరారు. పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా లాభం లేక‌పోయింది. దీంతో ట్రాఫిక్ ను డైవ‌ర్ట్ చేసి భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. ప్యార‌డైజ్ స‌ర్కిల్ వ‌ద్ద ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లను, మంద‌కృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్తితి నెల‌కొంది. ట్యాంక్ బండ్ పైకి రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మంద‌కృష్ణ ను అరెస్టు చేసి , ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పీఎస్ కు త‌ర‌లించారు. మొత్తం మీద ఎమ్మార్పీఎస్ మిలియ‌న్ మార్చ్ కు పిలుపునివ్వ‌డం ఆదివారం రాత్రంతా హైడ్రామా చోటుచేసుకుంది. v