ఆ అబ్బాయితో సాయిపల్లవి రొమాన్స్

తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకి మాత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే ఇష్టం. గతంలో ఆయనతో కలిసి రొమాన్స్ చేసింది. నాని-సాయి పల్లవి జంటగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (ఎంసిఏ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ జోడి మరోసారి కనువిందు చేయనుంది. నాని 27వ సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ రాబోతున్న సంగతి తెలిసిందే.

సోమవారం నాని బర్త్ డే కానుకగా ఆయన నటించినున్న 27వ సినిమా టైటిల్ ప్రకటించారు. ‘శ్యామ్ సింగ రాయ్’ పేరు పెట్టారు. ఈ చిత్రానికి టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్  దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నట్టు సమాచారమ్.కథ నచ్చడంతో సాయి పల్లవి నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.