‘హిట్’ సెన్సార్ రివ్యూ

విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్’. కొత్త దర్శకుడు శైలేష్ దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నాని బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా ఇది. టీజర్, ట్రైలర్ తో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయ్. భారీ అంచనాల మధ్య ఈ వారమే (ఫిబ్రవరి 28) ‘హిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. 

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చినట్టు తెలిసింది. విశ్వక్ సేన్ చెప్పినట్టు మొదటి 15 నిమిషాలు సినిమా స్లోగా అనిపిస్తోంది. ఒక్కసారి కథ వేగం పుంజుకున్నాక.. ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతుందని చెబుతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు రాని సరికొత్త సినిమా ఇదని.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుందని సెన్సార్ సభ్యుల టాక్ గా తెలుస్తోంది.  

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జంటగా రుహాని శర్మ నటించింది. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించిన మిస్టరీ చుట్టూ తిరిగే కథ.