ఢిల్లీ అల్లర్లు : 34కి చేరిన మృతుల సంఖ్య

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఈశాన్య ఢిల్లీలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 34కి చేరింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 7గురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 27 నుంచి 34కు చేరింది. దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు.

పెద్దఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించినప్పటికీ, పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. దీంతోప్రధాని నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని రంగంలోకి దించారు. మరోవైపు, ఈ హింసాకాండపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 1984 ఘటనలను పునరావృతం కానివ్వరాదన్న న్యాయస్థానం… బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.