మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరంటే ?

తెలుగు ప్రేక్షకులకి పండగ చేసుకొనే కాలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు మెరవనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్ సినిమాలో మహేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వాస్తవానికి చిరు సినిమాలో ఓ 30నిమిషాల పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకొన్నారు. అయితే, చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో ఆ పాత్ర కోసం మహేష్ ని సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయ్.

ఇప్పుడు మెగా సినిమాలో మహేష్ పాత్రేంటీ ? ఎంతసేపు కనిపిస్తారు ?? చిరు-మహేష్ కాంబోలో ఎన్ని సీన్స్ రాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ నక్సలైంట్ పాత్రలో కనిపిస్తారు. ఆయన దాదాపు 30నిమిషాల పాటు తెరపై కనిపించనున్నారు. ఇక చిరు-మహేష్ కాంబో 15నిమిషాల పాటు సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. అంతేకాదు.. మహేష్ కోసం హీరోయిన్ కూడా ఫిక్సయిందట. పూజా హెగ్డే ని తీసుకొన్నారట. గత యేడాది వీరిద్దరు కలిసి నటించిన మహర్షి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ హీరోయిన్ గా పూజా తీసుకొన్నారు.