సీక్రెట్ : 30యేళ్ల యువతిని పెళ్లాడిన దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి.. కొన్నాళ్లుగా టాలీవుడ్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్న న్యూస్ ఇది. దిల్ రాజు భార్య అనిత మూడు సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి రెడీ అయినట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై దిల్ రాజు స్పందించకపోవడంతో అది నిజమే అనుకొంటున్నారు. లెటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ? దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొన్నారు. 30యేళ్ల యువతిని పెళ్లాడారు. ఆమె ఎవరు ? అన్నది మాత్రం చెప్పడం లేదు.

దిల్ రాజుకు రెండో పెళ్లి సీక్రెట్ గా జరిగింది చెప్పుకొంటున్నారు. షాద్‌ నగర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో దిల్ రాజు రెండో పెళ్లి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అసలు రెండో పెళ్లి గురించి బయటికి చెప్పాలనే ఆలోచనే దిల్ రాజుకి లేదా.. ? లేదంటే.. జరుగుతున్న ప్రచారంలో.. సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారన్న న్యూసే నిజం కాదా ?? అన్నది తెలియాల్సి ఉంది.