అప్పుడు మహేష్.. ఇప్పుడు ప్రభాస్ హ్యాండిచ్చారు !
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగాకి హీరో దొరకడం లేదు. అర్జున్ రెడ్డి బాలీవుడ్ రిమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా ఖాళీగా ఉంటున్నారు. ఓ హారర్ థ్రిల్లర్ కథని రెడీ చేసుకొన్న సందీప్.. ఆ కథని బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో తీయాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత ఈ కథ ప్రభాస్ వద్దకి వచ్చింది. యూవీ క్రియేషన్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది.
గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ వంగా ఓ సినిమా చేస్తాడనే టాక్ వినిపించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి తర్వాత ఆయన మహేష్ తోనే సినిమా చేయాలి. కానీ క్యాన్సిల్ అయింది. సందీప్ చెబుతున్న రివల్యూషనరీ స్టోరీలు ప్రభాస్, మహేష్ లాంటి స్టార్స్ కు ఎక్కడం లేదు. అవన్నీ పాథ్ బ్రేకింగ్ కథలు. మరీ ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కు కాస్త దూరంగా ఉన్న కథలు. అందుకే మహేష్ లాంటి హీరోలు రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అందుకే అప్పుడు మహేష్.. ఇప్పుడు ప్రభాస్ సందీప్ కి హ్యాండిచ్చారు.