రివ్యూ : హిట్

చిత్రం : హిట్ (2020)

నటీనటులు : విశ్వక్ సేన్, రుహాని శర్మ

సంగీతం : వివేక్ సాగర్

దర్శకత్వం: శైలేష్ కొలను

నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని

రిలీజ్ డేట్ : 28 ఫిబ్రవరి, 2020

రేటింగ్ : 3.5/5

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన తొలి సినిమా ‘అ!’. విమర్శకుల ప్రశంశలు అందుకుంది. కమర్షియల్ గానూ హిట్ అయింది. నాని నిర్మాతగా చేసిన రెండో సినిమా హిట్. విశ్వ‌క్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. రుహాని శర్మ కథానాయిక. కొత్త దర్శకుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇదో సరికొత్త థ్రిల్లర్. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కథ ఇదని చిత్రబృందం చెప్పింది. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ : 

ప్రీతీ అనే అమ్మాయి కనిపించకుండా పోవడం.. కూతురు కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. ఈ కేసుని విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) హ్యాండిల్ చేస్తాడు. ఈ కేసులో పడి విక్రమ్ తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నేహా (రుహాని శర్మ)ని కోల్పోతాడు. ప్రీతి – నేహా ల మిస్సింగ్ వెనుక ఉన్న కథేంటి ? ప్రీతీ, నేహాల కేసుల ఇన్వెస్టిగేషన్ లో విక్రమ్ ఎదుర్కున్న సవాళ్లేంటి.? విక్రమ్ ఎలా ఆ కేసుని సాల్వ్ చేసాడు? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

*  విశ్వక్ సేన్ నటన

* సెకాంఢాఫ్

* క్లైమాక్స్

* ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ కాస్త డ్రాగ్ అవ్వడం

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

క్రైమ్ థ్రిల్లర్ అంటే ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తించాలి. ప్రేక్షకుడు మునివేళ్లపై నిలబెట్టాలి. ఈ  విషయంలో వివేక్ సాగర్ వందశాతం సక్సెస్ అయ్యాడు. క్రైమ్ చుట్టూ అల్లుకున్న అంశాలన్నీ సూపర్భ్. విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్ సేన్ నటన అదిరిపోయింది. మెంటల్లీ డిస్టర్బ్ అయిన షేడ్స్ చూపిస్తూనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు.

రుహాని శర్మ ఉన్నంతలో బాగానే చేసింది. విశ్వక్ సేన్-రుహాని శర్మల లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఈ సీరియస్ థ్రిల్లర్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ ద్వారా ఆడియన్స్ కి కొన్ని నవ్వులు పంచారు. భాను చందర్, మురళి శర్మ, హరితేజ తదితర నటీనటులు వారి వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. తెరపై విశ్వక్ సేన్ తప్ప.. మిగితావారు కనిపించేది చాలా తక్కువ సమయమే.

సాంకేతికంగా :

వివేక్ సాగర్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. గ్యారీ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే కావచ్చు. కానీ టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా తెర వెనుక టీం వెరీ హై బడ్జెట్ ఫిల్మ్ రేంజ్ కి తీసుకెళ్లారు. మణి కందన్ విజువల్స్ ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ఉంది.

చివరగా : హిట్.. సూపర్ హిట్ !

రేటింగ్ : 3.5/5