మెగా ఫ్యాన్స్ అంతా వైసీపీ కార్యకర్తలా ?
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ సినిమా ఫెయిల్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీని విజయవంతంగా నడపడటంలో ఫెయిల్ అయ్యారు. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక కేంద్రంలో ఎన్ డీయే అధికారంలోకి వచ్చాక చిరు సలైంట్ అయిపోయారు. అభిమానుల కోరిక మేరకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు.
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, చిరు వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకి రాజ్యసభని పంపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారం నిజమని తేలింది. చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో లక్షల స్థాయిలో అభిమానులు వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఏకీకృతం చేయడానికి చిరంజీవి అభిమానులందరికీ ఐడి కార్డులు ఇచ్చే పనులు ఈమధ్య మొదలు అయ్యాయి.
ఈ కార్యక్రమాలలో భాగంగా లేటెస్ట్ గా చిరంజీవి అభిమానులకు ఇచ్చిన ఐడి కార్డుల బ్యాక్ గ్రౌండ్ లో వైఎస్ఆర్ పార్టీ ఫ్లాగ్ కలర్స్ కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీంతో చిరు వైసీపీలో చేరడం ఖాయమైంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని ఆయన వైసీపీ చేరుతారు. రాజ్యసభకు వెళ్తారని చెప్పుకొంటున్నారు. ఈ లెక్కన చిరు అభిమానులంతా.. వైసీపీ కార్యకర్తలని భవించాలేమో… !