మరోసారి నోరు జారిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో ఉన్నప్పుడు మనసులో ఏదీ దాచుకోలేడు. దాన్ని వెంటనే బయటపెట్టేస్తాడు. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో ఆపులేక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. వాస్తవానికి.. అప్పటికి త్రివిక్రమ్-చిరు సినిమా ఫిక్స్ కాలేదు. సూచాయిగా అనుకొన్నారంతే. ఈలోగా త్రివిక్రమ్ సినిమాని చిరు ప్రకటించాడు. తప్పు చేశానా ? ఇప్పుడు చెప్పకుండా ఉండాల్సిందా ?? అంటూ అక్కడే ఉన్న త్రివిక్రమ్ మొహం చూసి నవ్వేశారు. త్రివిక్రమ్ నవ్వేసి.. పర్వాలేదు. కచ్చితంగా సినిమా చేద్దాం అన్నారు.
 
కానీ, ఇప్పటి వరకు త్రివిక్రమ్-చిరు సినిమా అప్ డేటు లేదు. తాజాగా మరోసారి ఆనందంలో మెగాస్టార్ నోరు జారారు. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం షూట్ శరవేగంగా సాగుతోంది. స్ట్రైక్ కు సంబంధించిన సీన్స్ కు చిత్రీకరించిన బృందం ఇప్పుడు ఫైట్స్ షూట్ లో బిజీగా ఉన్నారు. 

ఇదిలా ఉంటే ఆదివారం ‘ఓ పిట్ట కథ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరు విచ్చేశారు.  ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం గురించి చెప్పే క్రమంలో చిత్రం పేరును ‘ఆచార్య’గా ప్రకటించించారు. ఓ పిట్ట  కథ చిత్రబృందం చిరుకి ఇచ్చిన మర్యాద, గౌరవాన్ని ఆపులేక.. ఇలా తన తాజా సినిమా టైటిల్ ని ప్రకటించారు. వాస్తవానికి.. చిరు152 టైటిల్ ని ఓ వేడుకలా నిర్వహించి ప్రకటించాలని దర్శకుడు కొరటాల అనుకొన్నారంట. ఈలోగా చిరు నోరు జారాడు. తన తాజా సినిమా టైటిల్ ఆచార్య అని చెప్పేశారు. అయినా.. మెగా అభిమానులు హ్యాపీ.