నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్
నిర్భయ దోషులని మార్చి 3న ఉదయం 6గంటలకి ఉరితీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తెలిసిందే. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీం కోర్టులోనూ నిర్భయ నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని పవన్ గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అదేవిధంగా తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ పవన్ కుమార్, అక్షయ్ సింగ్ ఢిల్లీ పాటియాల కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్స్ ని న్యాయస్థానాలు కొట్టిపారేశాయ్. దీంతో రేపు ఉదయం నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలుకు లైన్ క్లియర్ అయింది.