దారుణం : నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్‌ఘడ్‌ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో నిర్భయ దోషులడెత్‌వారెంట్లపై కోర్టు స్టే విధించింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే కొనసాగుతుందని తెలిపింది. తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే విధించింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉరి తీయలంటూ పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది.కానీ, ఉరి అమలు వాయిదా పడుతూ వస్తోంది.