‘రాములో రాముల..’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా ?

ఏ క్షణంలో ‘అల.. వైకుంఠపురంలో’ పాతలు రాశారో.. ట్యూన్ కట్టారో కానీ అద్భుతంగా కుదిరాయి. మరుపురాణి తెలుగు ఆణిముత్యాల లిస్టులో చేరిపోయాయ్. అత్యధిక వ్యూస్, లైక్స్ సొంతం చేసుకున్న తెలుగు పాటలుగా సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ సాంగ్స్ చేరిపోయాయ్. ఇన్నాళ్లు వినిపించిన అల.. పాటలి ఇప్పుడు కనిపిస్తున్నాయి. వరుసగా అల.. సాంగ్స్ ఫుల్ వీడియో సాంగ్స్ క్యూ కడుతున్నాయి.

ఇప్పటికే సామజవరగమన, బుట్టబొమ్మ వీడియో సాంగ్స్ వచ్చేశాయి. తాజాగా మాస్ ఐటమ్ రాములో రాముల ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు తమన్‌ స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఇందులో బన్ని స్టెప్‌లు అభిమానులను అలరిస్తున్నాయి. ఆ స్టెప్పులని మీరు చూసేయండీ.. !