ఇంటర్ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్
తెలంగాణలో ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం, రేపు ద్వీతీయ సంవత్సరం పరీక్షలు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ. ఇంటర్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం నుండి 9 లక్షల 65 వేల 893 మంది విద్యార్థులు హాజరౌతున్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇంటర్ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి గురికావొద్దని, ఉత్తమ ప్రదర్శన చూపాలని సూచించారు. పరీక్షలు, గ్రేడ్లు ముఖ్యమే అయినప్పటికీ.. అవే జీవితం కాదన్నారు మంత్రి కేటీఆర్.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంటర్ విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఈ ఉదయం స్థానిక బృంగి కళాశాల, సిద్దార్థ కళాశాల పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న విద్యార్థులను కలిశారు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న పలువురి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని తామున్నామంటూ ధైర్యం చెప్పారు. పరీక్షలు బాగా రాయల్సిందిగా సూచించారు.
My best wishes to the lakhs of young students who are appearing for their Intermediate board (10+2) examinations starting today
While exams & grades are important, they are NOT everything in life. Don’t stress, Do your best 👍
— KTR (@KTRTRS) March 4, 2020