కరోనా ఎఫెక్ట్ : మెట్రో, ఆర్టీసీకి మంత్రి కేటీఆర్ విజ్ఝప్తి
ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ కరోనా వైరస్ పట్ల ప్రజలకి అవగాహన కల్పిస్తూనే… మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థలోనూ పరిశుభ్రతకి పెద్దపీఠ వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ మెట్రోరైలులో చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. అదేవిధంగా ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి ట్విట్టర్ ద్వారా కోరారు.
#Bengaluru#CaronaVirus@BMTC_BENGALURU Issued circular to depots directing them to maintain cleanliness inside buses. Sanitation staff cleaning door handle, arm rest inside buses with chlorine /alcohol-based disinfectants from Tuesday@NewIndianXpress @LaxmanSavadi @santwana99 pic.twitter.com/HZJBLydiSu
— TNIE Karnataka (@XpressBengaluru) March 3, 2020