బాలయ్యని భరించడం కష్టమే.. !
నట సింహం నందమూరి బాలకృష్ణకి హీరోయిన్స్ దొరకడమే కాదు.. నిర్మాతలు దొరకడమూ కష్టంగానే మారింది. అతి కష్టం మీద బోయపాటి-బాలయ్య సినిమా సెట్ అయింది. ఇదీగాక.. మరో రెండు, మూడు కథలని బాలయ్య ఓకే చేశారు. కానీ, నిర్మాతలు దొరకడం లేదు. దానికి బాలయ్య రెమ్యూనరేషన్ నే కారణమని చెబుతున్నారు.
తొమ్మిది నుంచి పది కోట్లు ఇస్తేనే సినిమా చేయడం. లేదంటే లేదు అంటున్నాడు బాలయ్య. అయితే, బాలయ్య సినిమా మార్కెట్ మాత్రం ఏ రేంజ్ లో పెరగలేదు. అప్పుడు.. ఇప్పుడూ అదే మార్కెట్. ఇదీగాక.. బాలయ్య ప్రయోగాత్మక సినిమాలేమీ చేయడం లేదు. రొటీన్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ నే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య పదికోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా చేయడం కష్టమని నిర్మాతలు జంకుతున్నారు.
గతంలో రవితేజ కూడా ఇలాగే ఉండేవారు. అయితే, ఆయన ఇటీవల కాస్త తగ్గారు. ప్రాఫిట్ షేరింగ్ కు దిగారు. దాంతో.. రవితేజకి నిర్మాతల కొరత తప్పింది. మరీ.. బాలయ్య ఎప్పుడు మారుతారు అనేది చూడాలి. ఇక సీనియర్ హీరోలు నాగ్, వెంకీ, బాలయ్యలలో వెంకీ మాత్రమే వరుస హిట్స్ దూసుకుపోతున్నారు. మిగితా ఇద్దరు.. హిట్స్ లేక డీలా పడిపోయిన సంగతి తెలిసిందే.