రాహుల్ పై దాడి.. ఎమ్మెల్యే సోదరుడిని కాపాడే ప్రయత్నం ?
బిగ్ బాస్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. అయితే పబ్ లో తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరు రితేష్ అతని స్నేహితులు.. రాహుల్ వెంట వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్థించడం.. వారిని రాహుల్ నిలదీయడంతో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది.
అది కాస్త ముదిరి.. రాహుల్ పై బీర్ బాటిల్స్ తో దాడి చేసే వరకు వచ్చింది. తీవ్ర గాయాలతో రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా.. అతడు పోలీసుకి ఫిర్యాదు చేయలేదు. ఈ దాడి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుమాటాగా తీసుకొన్న పోలీసులు కేసుని నమోదు చేశాడు. అయితే ఈ కేసులో పోలీసులు ఎమ్మెల్యే సోదరుడి పేరుని ప్రస్తావించడం లేదు. అసలు గొడవ జరగడానికి కారణం అమ్మాయి కాదని చెబుతున్నారు.
మరోవైపు రితేష్ రెడ్డి కనిపించకుండా పోయాడు. సోదరుడి నిర్వాహకంపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. అసలు తన తమ్ముడు పబ్ కే వెళ్లలేదు. పబ్ లో ఉన్నది తమ్ముడు స్నేహితులని మాత్రమే చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ఈ దాడి కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి కాపాడే కాపాడే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.