కరోనా ఎఫెక్ట్ : ఐఫా ఉత్సవం వాయిదా

కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే పడుతోంది. కొన్ని సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. మరికొన్ని సినిమాలు విడుదల తేదీని మార్చుకుంటున్నాయి. తాజగా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల (ఐఫా) ఉత్సవం వాయిదా పడింది. ఈ నెలాఖరున భోపాల్ లో ఐఫా ఉత్సవం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు జరిగాయి. అయితే కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ మనదేశంలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మన దేశంలో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోలీ జరుపుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.